దుక్కిని దున్నిన నా జీవితానికి దుఃఖమే మిగిలింది అన్నం పెట్టిన నా చేతులు అరచేతి గీతలు అరుగుతున్నాయి
పొలం దున్ని పోగేసుకున్న అప్పు తప్ప ఆత్మకేం మిగిలింది పస్తులుండి పంటను తీసి ప్రపంచానికి బువ్వ పెట్టి బూడిదవుతున్న మిత్తి ఒత్తిడే మిగిలింది ఏముంది?
కోతలు కోసిన నా చేతికి కొడవలి కోతలే మిగిలే గింజలు తీసిన నా మనసుకు గిట్టని ధరలే మిగిలే
ఎగుమతి ఎద మీద ఏసింది భారం కష్టానికి మిగిలే కారిన స్వేదం కారిన చెమట ఖరీదు లేదు ఎవుసమంటే రైతు ఏడుపేనా?