కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కే సీఎం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. సీతక్క అభిమానులు, పార్టీ నాయకులు కొందరు అభినందనలు చెప్పడానికి ఫోన్ చేస్తే, అలాంటిదేమీ లేదు లైట్ తీసుకోండని ఆమె చెప్పినట్టు తెలిసింది. ప్రెస్మీట్లో పక్కన ఉన్నానని నన్ను సీఎం అన్నారు. అక్కడ మీరున్నా మిమ్మల్నే సీఎం అనేవారని చెప్పినట్టు తెలిసింది. రేవంత్‌ను వ్యతిరేకించేవారు పార్టీలో రోజురోజుకు పెరిగిపోతుండటంతో తనతో పాటు ఉన్నవారికి సీఎం పోస్టు మీకే అంటూ ఈ మధ్య ఆయన బిస్కట్ వేస్తున్నారని గాంధీభవన్‌లో చెప్పుకొంటున్నారు.