దశాబ్దాల పరాయి పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నది తెలంగాణ. వీరుల పోరాటంతో త్యాగాల ఫలాలు అందుకుంటున్నది. కానీ.. తెలంగాణకు ప్రమాదం ఇంకా పొంచే ఉన్నది. కుట్రదారులు మారువేషాల్లో తిరుగుతున్నారు. ఇది ముమ్మాటికీ నిజం. ప్రజానీకం అప్రమత్తంగా లేకపోతే… ఇక్కడి కీలు బొమ్మలతోనే పరాయి పాలకులు మళ్లీ మన బతుకుల్ని ఆగం చేయడం ఖాయం. ఇందుకు అనేక ఉదాహరణలు మన కండ్ల ముందు కనిపిస్తున్నాయి. దొంగలంతా పట్టపగలే కత్తులు భుజాలపై వేసుకుని తిరుగుతున్నారు. ఆదమరచి ఉంటే… మళ్లీ మనం అన్యాయమైపోతాం. అస్తిత్వం కోల్పోతాం. తెలంగాణ రాష్ట్రం విఫల ప్రయోగమని హేళనకు గురవుతాం.
తెలంగాణలో కనుమరుగైన టీడీపీ… కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందం చేసుకున్నది. ఒప్పందంలో భాగంగా చంద్రబాబు.. తన బానిస రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇప్పించాడు. ఇది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్లో చాలామంది చెప్పేమాట కూడా ఇదే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టడ మే లక్ష్యంగా రేవంత్ రాజకీయం చేస్తున్నాడు. సందర్భం వచ్చిన ప్రతిసారి… నిస్సిగ్గుగా చంద్రబాబుపై ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. చంద్రబాబు ఎజెండానే అమలు చేస్తున్నాడు. ఇప్పుడు మరోసారి రేవంత్ అసలు రంగు బయటపడింది. బయటపడింది అనడం కూడా కరెక్టు కాదేమో… ఎందుకంటే.. అది బహిరంగ రహస్యమే. తెలంగాణలో టీడీపీని దెబ్బ తీసినందుకు తెగ బాధ పడిపోతూ…. తాజాగా చంద్రబాబుపై అభిమానం చాటుకున్నాడు. తాను చంద్రబాబుకు బానిసే అని నిరూపించుకున్నాడు.
పాలకుర్తి ప్రచారసభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ‘తెలంగాణలో టీడీపీని దెబ్బ తీసింది ఎర్రబెల్లి దయాకర్రావు’ అని అన్నాడు. అందుకే తెలుగుదేశం అభిమానులు ఎర్రబెల్లిని ఓడించాలని పిలుపునిచ్చాడు. అసలు.. రేవంత్, నువ్వు కాంగ్రెస్ లీడర్వా? టీడీపీ లీడర్వా? ఏం బానిస బతుకు నీది అని… జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తెలంగాణ వాదులంతా రేవంత్ బానిసత్వాన్ని ఎండగడుతున్నారు.
చంద్రబాబుపై ప్రేమను చాటుకోవడం ఏంటని నిలదీస్తున్నా రు. ప్రాంతీయేతరుడు మోసం చేస్తే ఎలా గుణపాఠం చెప్పాలో కాళోజీ మనకు బోధించారు. అదే చేశాం. మరి ప్రాంతం వాడు మోసం చేస్తే ఏం చేయాలో కూడా చెప్పారు. కాబట్టి… బిడ్డా రేవంత్ తస్మాత్ జాగ్రత్త అంటూ జనం హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో రైతుల రక్తం ఏరులై పారించిన చరిత్ర చంద్రబాబుది. ప్రశ్నించిన గొంతుల్ని మాయం చేసిన నరరూప రాక్షసుడు చంద్రబాబు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న కుట్రదారు చంద్రబాబు. రాష్ట్ర ఏర్పాటు జరిగే ఆఖరి నిమిషంలోనూ చంద్రబాబు కుట్రలు కొనసాగించాడు. అటువంటి తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజలు కరకట్టకు తరిమికొట్టారు. కానీ, ఆ పార్టీ బానిసలు కొందరు ఇంకా తెలంగాణలో వివిధ ముసుగుల్లో తిరుగుతున్నారు. టీడీపీ పేరుతో రాజకీయం చేస్తే, మొహంపై జనం ఉమ్ముతారు కాబట్టి, కండువా లు మార్చి మారు వేషంలో నాటకాలు ఆడుతున్నారు. ఇందులో నెంబర్వన్ తెలంగాణ ద్రో హి… రేవంత్ రెడ్డి. తెలంగాణ సమా జం జాగరూకతతో వ్యవహరించి… దొంగల భరతం పట్టాలి.
– ఇనుగుర్తి సత్యనారాయణ 9704617343