రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలను చూస్తుంటే… మహాకవి వేమన శతకంలోని ‘అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను..’ అనే పద్యం పదే పదే గుర్తుకువస్తున్నది. అటు అల్పుడు ఇటు శాంతమూర్తి బుద్ధిని పోల్చిన తీరును బేరీజు వేసుకోవాలి. ఇదే పద్యంలో ‘కంచుమ్రోగునట్లు కనకంబు’ అనే వ్యాఖ్యానాలను కూడా గుర్తుచేసుకోవాలి. కంచు శబ్దం చేసినట్టుగా, బంగారం శబ్దం చేయదు! అలాగే అల్బబుద్ధి కలిగినవాడిని కంచుతోనూ, శాంతమూర్తిని బంగారంతో పోల్చాడు వేమన.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అల్పబుద్ధి కలిగినవాడు కాబట్టే ఎప్పుడూ.. డాంబికాలు పోతూ, ఆడంబరంగా, తుపాకీ రాముడి వలె మాటలు చెప్తుంటడు. శాంతమూర్తి అయిన కేసీఆర్ ఎల్లప్పుడూ శాంతంగా ఉంటాడు. ఓటుకు నోటు కేసు లో నిందితుడైన రేవంత్‌ను, ఒంటి చేత్తో రాష్ర్టాన్ని సాధించి తెచ్చుకొని తెలంగాణను అన్నిరంగాల్లో నంబర్ వన్‌గా నిలిపిన కేసీఆర్‌తో పోల్చడమే సరికాదు. సీఎం రేవంత్ వ్యవహారశైలిపై కాంగ్రెస్ పార్టీలో నే విపరీతమైన చర్చ జరుగుతున్నది. ఓ మరుగుజ్జుకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చినందుకు ఆ పార్టీ హైకమాండ్ సిగ్గుతో తలదించుకుంటున్నట్టుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
పద్నాలుగేండ్ల ఉద్యమ పార్టీ, పదేండ్ల అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ను కాదని, అబద్ధపు ప్రచారాలు నమ్మి ప్రజ లు కాంగ్రెస్ పారీకి ఓ అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ కంటే, కేసీఆర్ పాలనను మరిపించే విధంగా రేవంత్ పాలన ఉంటుందని తెలంగాణ ప్రజలు ఆశించారు. అందుకనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఐదేండ్లు సుభిక్ష పాలన అందించాలని, బీఆర్ఎస్ కంటే రెట్టిం పు పాలన సాగించాలని నిండైన ఆశీర్వచనం ఇచ్చారు. గాడి తప్పతున్న పాలన పట్ల విమర్శలు గుప్పించరాదని, ఏడాది సమయం ఇవ్వాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హితవు పలికారు. తెచ్చుకున్న తెలంగాణ తెర్లవుతున్నా, తన పథకాలన్నింటినీ రద్దు చేస్తున్నా, కార్యకర్తలు, నేతలపై కేసులు పెడుతున్నా మౌనంగా ఉన్నారే తప్ప, రేవంత్‌ను విమర్శించలేదు.
కానీ, సీఎం రేవంత్ రెడ్డి పాలన గాలికివొదిలి పదే పదే కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని తిట్ల దండకం తో మాట్లాడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నా, మాట్లాడాలన్నా ఆయన స్థాయికి తగ్గవారెవరున్నారని ప్రశ్నించడం తప్పా? కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడమే మంచిదని ఓ కొడుకుగా ఆయన తలపోయడంలో తప్పేమిటి? నిజంగా కూడా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావాలి? ఎవరితో చర్చించాలి? ఓ పక్క ఏడాదిన్నర ఏడుపుగొట్టు పాలన చూసి ప్రజల పక్షాన అసెంబ్లీకి కేసీఆర్ రావాలని, ఆయన సలహాలు కావాలని ఓ పక్క కాంగ్రెస్ సీనియర్లు అంటుంటే సారొస్తే ఏం జరుగుతుందో ముందే ఊహించి ఆయన్ను కట్టడి చేసే చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఒడిగట్టినట్టు స్పష్టమవుతున్నది.
అంటే అన్నంపెట్టిన వాడికి సున్నం పెట్టేవిధంగా ఆశీర్వచనాలందించిన కేసీఆర్‌నే తరచూ తూలనాడటం, ఆయన కుటుంబాన్ని లక్ష్యం చేయ డం ఓ అడుగు ముందుకేసి ఆయన మరణాన్ని కోరుకోవడం అంటే ముఖ్యమంత్రి తన స్థాయిని తానే దిగజార్చుకోవడం. ఆరోగ్యంగా , ఆపద్బాంధవుడిలా ఉం డే కేసీఆర్ మార్చురీకి పోవాలని నీచ బుద్ధితో సీఎం రేవంత్ ఎందుకు కోరుకుంటున్నరు? ఎంత శత్రువై నా, పగ, ప్రతీకారం ఉన్నా ఎదుటి వ్యక్తి మరణాన్ని ఎలా కోరుకుంటారు? అసలు రేవంత్ ఉద్దేశమేమిటన్న చర్చ జోరుగా సాగుతున్నది.
ఓ పక్క కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ఆయన విలువైన సూచనలు పాలన అనుభవాలు తెలంగాణ కు అనినార్యమని స్పీకర్, మంత్రులు సహా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు నేరుగా వెళ్లి బతిమిలాడుతుంటే ఇం కోపక్క సీఎం రేవంత్ కేసీఆర్‌ను కేంద్రంగా చేసుకుని 15 నెలల నుంచి చేస్తున్న విమర్శలను చూస్తుంటే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూ కడుపులో విషపు కత్తులు పెట్టుకు తిరుగుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి. రాష్ర్టాన్ని తెచ్చిన పెద్దాయన మరణశాసనా న్ని స్వయంగా సీఎం లిఖించడాన్ని తెలంగాణ సమా జం నిశితంగా గమనిస్తున్నది.
కేసీఆర్ స్ట్రెచ్చర్ మీద ఉన్న తెలంగాణ వాదానికి ఊపిరిపోసి రాష్ర్టాన్ని సాధించినవారు. మార్చురీకి మర్లుతున్న రైతుల జీవితాలను మార్చడానికి భగీరథ తపస్సు చేసినవారు. వలస పాలకుల చేతిలో జీవచ్ఛవంలా ఉన్న తెలంగాణకు జీవం పోసినవారు. నీళ్లు లేక నెర్రలు బారిన ఈ నేలకు కృష్ణా, గోదావరి జలాలతో దూప తీర్చినవారు. అన్నం మెతుకు దొరకని తెలంగాణను అన్నపూర్ణగా మార్చినవారు. షాక్‌లు ఇచ్చే కరెంటును సరిచేసి 24 గంటల వెలుగులు విరజిమ్మేలా చేసినవారు. తెర్లయిన తెలంగాణ బతుకుల కు తెరచాపై గమ్యం చూపినవారు కేసీఆర్. బక్క పలుచని మనిషైనా ఉక్కు గుండె గలవాడు కేసీఆర్. గడ్డి పోచ లెక్క పదవులను విసిరేసి తెలంగాణను సాధించి ప్రజల హృదయాలను గెలుచుకున్నవారు కేసీఆర్. అలాంటి ధీశాలిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యల పట్ల యావత్తు తెలంగాణ సమాజం తీవ్ర అభ్యంతరం, నిరసన వ్యక్తం చేస్తున్నది. హోదా, వయస్సు, యశస్సు గుర్తెరుగకుండా ఉచ్ఛం, నీచం తేడా తెలియని సభా నాయకుడి మధ్య కూర్చుంటే సభకే అవమానం.
కేసీఆర్ ఇవాళ అధికారంలో లేకపోవడం వల్ల ఆయన లోటు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. నిర్బంధకాండ, అక్రమ కేసులు, అరెస్టులు నిత్యకృత్యమయ్యాయి. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో తెలంగాణ ప్రజలు వ్యవసాయానికి జీవనాడిగా నిలిచిన రైతు బంధును కోల్పోయారు. మత్స్యకారులు చేప పిల్లల పంపిణీ కోల్పోయారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన దళిత బంధును కోల్పోయారు. బీసీలకు బాసటగా నిలిచిన బీసీ బంధును కోల్పోయా రు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలకు కేవలం వ్యక్తిగత కక్షతోనే చరమగీతం పాడాడు.
గుర్రానికి వేగం ఉండాలి. ఏనుగుకు బలం ఉండా లి. రాజుకు పాలనాదక్షత ఉండాలి. మంత్రికి తెలివి ఉండాలి. బంటుకు భక్తి ఉండాలి. సేనాధిపతికి వ్యూహం ఉండాలి. సైనికుడికి తెగింపు ఉండాలి. ఇవన్నీ కలగలిపే రాజ్యం, ఆ రాజ్యం సుభిక్షం. పై లక్షణాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవ్వరికీ ఏ ఒక్క లక్ష ణం లేదన్నది సుస్పష్టం. అసమర్థుడి చేతిలో రాష్ర్టాన్ని పెట్టి ఫలితాలు ఆశించడం వృథా ప్రయాస. అబద్ధాలు, మోసాల్లో రాటుదేలిన ముఖ్యమంత్రి రేవంత్ నుంచి తెలంగాణ సమాజం ఇంతకన్న ఎక్కువగా ఆశించడం కూడా దండుగే.
– గోసుల శ్రీనివాస్ యాదవ్ 98498 16817