ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని సాధ్యంకాని వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తున్నది. గతంలో ఏ వర్గాలపై అయితే రాజకీయ ఆధిపత్యం చెలాయించిందో, ఏ వర్గాల రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడిందో, ఆ వర్గాలకు న్యాయం చేస్తామని గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తున్నది. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు ఆ వర్గాల డిక్ల్లరేషన్ ప్రకటిస్తూ తద్వారా అధికారం చేపట్టాలని తహతహలాడుతున్నది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ వాటా సంగతి పక్కనపెడితే, వెనుకబడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ప్రయత్నించలేదన్నది వాస్తవం.
దేశంతోపాటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన చరిత్రను ప్రజలు ఎప్పటికీ మరువ రు. డిక్ల్లరేషన్లతో మరోసారి ప్రజలను ము ఖ్యంగా బీసీలను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీని విశ్వసించే స్థితిలో బీసీలు లేరని విషయాన్ని గ్రహించాలి.
130 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బీసీల సంక్షేమం కోసం స్పష్టమైన విధానాలను అమలుపరిచిన సంద ర్భం ఒక్కటి కూడా లేదు. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని రెండు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడగొట్టారు. స్వతంత్ర భారతంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ బాధ్యతను విస్మరించాయి. బీసీల సంక్షేమం కోసం పాటుపడకుండా అనుక్షణం ఆధిపత్యం, అణచివేత ధోరణితోనే కాంగ్రెస్ పార్టీ ముందుకుసాగింది.
అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించింది. అందులో భాగంగా వామపక్ష నేతగా, ప్రజల నాయకుడిగా అనేక పోరాటాలు చేసిన నోముల నర్సింహయ్యకు నాగార్జునసాగర్ నుంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించింది. అయితే అనారోగ్యంతో ఆయన మరణిస్తే ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు నోముల భగత్‌కు అవకాశం కల్పించింది. బీసీ నేత మరణిస్తే అభ్యర్థిని నిలపకుండా మద్దతు ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ అక్కడ తమ అభ్యర్థిగా జానారెడ్డిని నిలిపి బీసీలకు తమ పార్టీ వ్యతిరేకమని చెప్పకనే చెప్పింది.
ఒకప్పుడు బీసీలకు నామినేటెడ్ పదవులు అందని ద్రాక్ష పండే. పార్లమెంటులో రాజ్యసభ అయిన, అసెంబ్లీలో ఎమ్మెల్సీ అయినా బీసీలకు దక్కాలంటే పెద్ద ఎత్తున పైరవీలు చేయాల్సిన పరిస్థితి. అయితే 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బీసీల రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొలువుదీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రాజకీయ నిర్ణయాలు తీసుకున్నది.
పార్లమెంటు మొదలుకొని పంచాయతీల దాకా బీసీలు రాజకీయంగా ఎదగాలని ప్రత్యేక రిజర్వేషన్లను తీసుకువచ్చింది. వార్డు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మునిసిపల్ చైర్మన్లు, మేయర్ తదితర ఎన్నికల్లో బీసీలకు ప్రత్యేకంగా వాటాను కేటాయించింది. తత్ఫలితంగా అనేకమంది బీసీలు ఇవాళ ప్రభుత్వ పదవుల్లో ఉన్నారు. పలువురు బీసీ నేతల ను బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటుకు పంపిం ది. 2014 ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలనుంచి వచ్చిన బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్‌లను లోక్‌సభకు పంపింది. కే.కేశవరావు, డి.శ్రీనివాస్, బండ ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్, ఒద్దిరాజు రవిచం ద్ర తదితర నేతలను రాజ్యసభకు పంపి బీసీల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో బీఆర్ఎస్ అత్యున్న త పదవులకు బీసీలను ఎంపిక చేసింది. అసెంబ్లీలో అత్యున్నత పదవైన స్పీకర్ హోదాను వెనుకబడినవర్గాల నుంచి వచ్చిన నాటి భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనాచారికి కట్టబెట్టింది. శాసనమండలి చైర్మన్‌గా స్వామిగౌడ్‌ను నియమించింది. జోగు రామన్న, ఈటెల రాజేందర్, గంప గోవర్ధన్, దాస్యం వినయభాస్కర్, సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు, చింతా ప్రభాకర్, కేపీ వివేకానంద, ప్రకాశ్‌గౌడ్, పద్మారావు గౌడ్, అంజయ్య యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొండా సురేఖ, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, దానం నాగేందర్, గంగుల కమలాకర్, బొల్లం మల్లయ్య యాదవ్, బాజిరెడ్డి గోవర్ధన్, జైపాల్ యాదవ్, ముఠా గోపాల్, నన్నపనేని నరేందర్‌లకు ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించింది. ప్రజలు ఎన్నుకునే పదవులే కాకుండా రాజ్యాంగ పదవుల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించాలని అనేకమంది బీసీ బిడ్డలను బీఆర్ఎస్ శాసనమండలికి ఎంపిక చేసింది.
అందులో స్వామిగౌడ్, పూల రవీందర్, గంగాధర్ గౌడ్, కొండా మురళి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత, సుంకరి రాజు, దండె విఠల్, ఎల్. రమణ, యెగ్గె మల్లేశం, మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య లాంటి ఎంతోమంది బీసీ నాయ కులు పదవులు పొందిన వారిలో ఉన్నారు. ఇవేగాకుండా అనేక కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల్లో బీసీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది. అల్లం నారాయణ, జూలూరు గౌరీశంకర్, బి.ఎస్.రాములు, వకుళాభరణం కృష్ణమోహన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, సీహెచ్ రాకేష్, ఆకుల లలిత, పల్లె రవికుమార్ గౌడ్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, బాజిరెడ్డి గోవర్ధన్, చింతా ప్రభాకర్, ప్రవీణ్, డాక్టర్ ఆంజనేయ గౌడ్, పిట్టల రవీందర్ వంటి వారిని కార్పొరేషన్ పదవుల్లో కూర్చోబెట్టింది. ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి తాండూరి శ్రీనివాస్ ను చైర్మన్‌గా నియమించింది. బొంతు రామ్మోహన్ వంటి విద్యార్థి నేతకు హైదరాబాద్ నగర మేయర్ పీఠాన్ని అప్పగించిం ది. ఇట్లా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ వారి పక్షాన నిలబడి, పోరాడింది.
ఏడు దశాబ్దాలుగా దేశ పాలనలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు బీసీల సంక్షేమాన్ని విస్మరించాయి. వారికి రాజకీయ అవకాశాలు ఇవ్వకుండా, కల్పించకుండా అడ్డుపడ్డాయి. స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయ లేని దౌర్భాగ్యస్థితిలో గత ప్రభుత్వాలు పని చేశాయి.
ఇక కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ల పేరుతో మరోసారి బీసీలను మోసం చేయాలని ముందుకొస్తున్నది. వారు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతులను నిర్వహించనివారు ఇవాళ బీసీల సంక్షేమం కోసం పాటుపడతామని కల్లబొల్లి కథలు చెప్తే గుడ్డిగా నమ్మే స్థితిలో బీసీలు లేరని కాంగ్రెస్ గ్రహించాలి. ఇప్పటికే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీసీలకు చేసిన అన్యాయం విశ్లేషణ చేసుకోకపోగా డిక్లరేషన్ల పేరు తో మళ్లీ మోసం చేయాలని చూస్తే.. ప్రజలు కాంగ్రెస్ పార్టీని డిైక్లెన్ చేయడం ఖాయం.