కరపత్రం

రైతులకు కేసీఆర్ నాయకత్వం కావాలె
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘నూతన వ్యవసాయ చట్టాల వల్ల దేశ వ్యవసాయరంగం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా రైతులు పోరుబాట పట్టారు. రాజకీయ పార్టీలు, ఉద్యోగ, కార్మిక సంఘాలతో పాటు కవులు, కళాకారులు రైతులకు మద్దతు పలికారు. ప్రవా సులూ సంఘీభావం తెలుపుతున్నారు. అయినప్పటికీ ఈ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడం లేదు.
వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకున్నది. ఈ దుస్థితి నుంచి రైతాంగాన్ని గట్టెక్కించే సరైన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అని దేశవ్యాప్తంగా రైతాంగం భావిస్తున్నది. కోట్లాది రైతు కుటుంబాల తరఫున పోరాటం చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి కేసీఆర్‌ను కోరుతున్నది.రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి కనీసంగా కింద సూచించిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు రక్షణ సమితి డిమాండ్ చేస్తున్నది.
1. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సంబంధిత రైతు 50 శాతం ఖర్చు భరించేవిధంగా అన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలి. రైతులు పండిస్తున్న ప్రధాన పంటలపై ఎకరానికి రూ.12-15 వేల వరకు నష్టం వస్తున్నది. ఈ నష్టాల నుంచి బయటపడటానికి, జాతీయ ఉపాధిహామీ పథకాన్ని అన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలని రైతులు కోరినప్పటికీ, రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రైతు సమస్యల పరిష్కారానికి గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇప్పటి బీజేపీ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవటం రైతు వ్యతిరేకతకు నిదర్శనం.
2. వ్యవసాయరంగం బాగుపడాలంటే స్వామినాథన్ కమిషన్ సూచనలు అమలుచేయాలి.
3. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు రైతు ఆదాయం 2022 వరకు రెట్టింపు కావాలంటే ఇప్పటినుంచే ప్రధాన పంటలకు క్వింటాల్‌కు రూ. 600 నుంచి 1000పైగా మద్దతు ధర ఏటా పెంచాలి.
4. పంటల బీమా ప్రీమియం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఏదేని కారణం చేత పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం ఇప్పించేవిధంగా పంటల బీమా పథకం అమలుచేయాలి.
5. రైతులు, రైతు కూలీలు అందరికీ రూ. 10 లక్షల వరకు వారి సొంత పూచీకత్తుపై బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక రుణాలు అందించాలి.
6. రైతులు వినియోగించే ఎరువులను నామమాత్రపు ధరకే ఇవ్వాలి.
7. యాభై ఐదు ఏండ్లు నిండిన ప్రతి రైతులకు, రైతు కూలీలకు రూ.10 వేలకు పైగా పింఛన్ ఇవ్వాలి.
8. రైతులకు, రైతు కూలీలకు వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలి.
ఈ పరిస్థితుల్లో రైతుల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన నాయకుడి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణను రైతు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారి నాయకత్వం కావాలని దేశవ్యాప్తంగా రైతాంగం కోరుతున్నది.
-పాకాల శ్రీహరిరావు, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రైతు రక్షణ సమితి
తాజావార్తలు
- నేను హర్ట్ అయ్యా.. రాహుల్‌కు జ్ఞాపకశక్తి తగ్గిందా ?
- భార్యకు టీఎంసీ టికెట్.. హౌరా ఎస్పీని తొలగించిన ఈసీఐ
- 'అలాంటి సిత్రాలు' టీజర్ విడుదల
- కాగజ్‌నగర్‌లో స్కూటీని ఢీకొట్టిన ఆటో.. వీడియో
- ‘పల్లా’కు మద్దతుగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ప్రచారం
- బీబీసీ ఇండియా స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్‌గా హంపి
- అవినీతి అధికారి ఇంట్లో సోదాలు.. భారీగా బంగారం, నగదు స్వాధీనం!
- ప్రశ్నోత్తరాలను అడ్డుకున్న విపక్షాలు.. ఉభయసభలు వాయిదా
- కొవిడ్‌తో పోరాటం నాకు మూడో యుద్ధం
- కోవిడ్ టీకా తీసుకున్న 2.3 కోట్ల మంది