శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - May 06, 2020 , 00:04:40

అభివృద్ధికి ప్రమాణమేది?

అభివృద్ధికి ప్రమాణమేది?

కరోనా వైరస్‌ అభివృద్ధి చెందిన దేశాల ఉన్నతిని వెక్కిరిస్తున్నది. ఇం గ్లండ్‌ కరోనా బారి నుంచి తమ పౌరులను రక్షించుకోవడానికి ఒకప్పుడు బానిసలా చూసిన భారత్‌ను యాచిస్తున్నది. వర్ధమాన దేశాల వన రులు, మేధోసంపత్తిని కాజేసి, అదే తన ఘనతగా అమెరికా గొప్పలకు పోయింది. కరోనా విషయంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి తమ అసహనాన్ని చైనా మీదనో, ఐరాస మీదనో చూపెడుతున్నది. మరోవైపు హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మాత్ర లు తమకు ఎగుమతి చేయకపోతే ఆంక్షలు విధిస్తామని భారత్‌ను హెచ్చరిస్తున్నది.

నిజానికి అసలు అగ్రరాజ్యం అం టే ఏమిటి? అభివృద్ధి చెందిన దేశమంటే ఏమిటి? ప్రతి ఒక్కరూ కారు కలిగి ఉండటమా అభివృద్ధి అంటే? లేక తలసరి ఆదాయం ఎక్కువ ఉం డటమేనా? ఆయుధ సంపత్తిని పెం చుకొని చిన్నదేశాలపై ఆంక్షలు విధిం చి బెదిరించడమేనా? ప్రపంచంలో ని అగ్రగామి సంస్థలైన ఐరాస, ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ లాంటి వాటిని చెప్పుచేతల్లో పెట్టుకోగానే సరిపోయిందా? ఇన్నాళ్లూ తాము చెప్పుకుంటున్నదే నిజమైన అభివృద్ధి అయితే.. ఈరోజు అగ్రరాజ్యాలు ఎందుకు ప్రపంచవీధిలో బేలగా నిలబడినాయి?

‘యథా రాజా తథా ప్రజా’ అన్నా రు మన పూర్వీకులు. రాజు ఎంత సమర్థవంతుడు, వివేకవంతుడైతే పరిపాలన అంత ప్రజారంజకంగా ఉంటుంది. ప్రజలు కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ఇప్పటి కరోనా నేపథ్యంలో ప్రపంచాన్ని పరిశీలిస్తే ఈ విషయాలు అవగతమవుతున్నా యి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నే నాయకత్వానికి విషమపరీక్ష ఎదురవుతుంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైనవిధంగా తమ నాయకత్వ ప్రతిభతో ప్రజలకు భరోసా కలిగిస్తున్నాయి. కరోనాను ఎదుర్కోవడంలో ప్రపంచదేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకునే అమెరికా, ఇంగ్లండ్‌, ఇట లీ, జర్మనీ లాంటి దేశాల పరిస్థితి ఈరోజు దయనీయంగా ఉన్నది. ప్రపంచంలోనే అత్యున్నత వైద్యసేవ లు దొరికేవిగా పేరున్న అమెరికా, యూరప్‌ దేశాలు వేలకు వేలుగా ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే చేష్టలుడిగి చూసే దుస్థితి వచ్చింది. మం దుల కొరతతో తల్లడిల్లుతున్నాయి. మందుల కోసం వర్ధమాన దేశాల వైపు చూస్తున్నాయి. ఈ సమయంలోనూ మనదేశం బ్రిటన్‌కు ముప్పై లక్షల పారసెటమాల్‌ మాత్రలు అం దిస్తున్నది. అలాగే అమెరికాకు రెం డుకోట్ల హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మాత్రలు ఎగుమతి చేస్తున్నది. అంతేగాకుండా 108 దేశాలకు 85 మిలియన్ల క్లోరోక్విన్‌ మాత్రలు ఎగుమతి చేస్తున్నది.

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడం లో ఆయా దేశాల్లో నాయకత్వ నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తున్నది. భారత్‌లో మాత్రం నాయకత్వ ముందుచూపు నిర్ణయాలు ఎంతో మేలు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌తో కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేయ టం మొదలు ప్రజలను ఆదుకోవటంలో ప్రత్యేక శ్రద్ధ వహించటం హర్షణీయం.

(వ్యాసకర్త: వైద్యులు,ప్రభుత్వ ఈఎన్‌టీ దవాఖాన కోఠి, హైదరాబాద్‌)


logo