బంజారాహిల్స్ : పుట్టినరోజున గుడికి వెళ్ళివస్తానంటూ ఇంట్లోంచి వెళ్లిన యువతి అదృశ్యమయిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న కే.భవానీ (23) అనే యువతి గత నెల 27న తన పుట్టిన రోజు కావడంతో గుడికి వెళ్లివస్తానంటూ తండ్రికి చెప్పి వెళ్లింది.
సాయంత్రమైనా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆమె సెల్‌ఫోన్‌కు కాల్ చేయగా స్విచ్ఆఫ్ అని వచ్చింది. అప్పటినుంచి అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో మంగళవారం తండ్రి కే.నగేష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది కూడా తన కూతురు పుట్టినరోజు నాడు పరమేశ్వర్ అనే వ్యక్తితో కలిసి వెళ్లిందని, రెండ్రోజుల తర్వాత తిరిగి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.