suicide | మనస్తాపంతోవ్యక్తి ఆత్మహత్య

బడంగ్‌పేట : ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివనారాయణ పురంలో నివాసం ఉండే బండి సాయిరాజ్ (42) ఇంట్లో ఎవరు లేని సమయంలో నాలుగు రోజుల క్రితం చున్నితో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎఎస్ఐ తిరుపతి తెలిపారు. సాయి రాజ్ ఇంటి దగ్గర దుర్వాసన రావడంతో మీర్‌పేటలో ఉన్న సాయి రాజ్ సోదరుడు జయరాజ్‌కు స్థానికులు పోన్ చేశారు. ఆయన వచ్చి చూసే సరికి అప్పటికే మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సాయి రాజ్‌కు భార్య భబిత ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సాయి రాజ్ కోఠిలోని తూర్పుబజార్‌లో పనిచేస్తారని పోలీసులు తెలిపారు. ఇటీవల భబిత, ఇద్దరు పిలల్లతో పీఎన్టీ కాలనీలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది.ఈనెల 10న తిరిగి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న బంగారం కనిపించకపోవడంతో భర్తను అడిగింది. దీంతో సాయిరాజ్ బంగారాన్ని తాకట్టు పెట్టిన్నట్లు చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. కాగా అదే కోపంతో భబిత 11 న తల్లిగారి ఇంటికి పోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

