అంబర్‌పేట : రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేపోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దీపావళి రోజు సీతాఫల్మండి రైల్వేస్టేషన్ నాలుగో ప్లాట్ఫారం పై ఓ వ్యక్తి మృతదేహం పడి ఉందనే సమాచారం పోలీసులకు అందింది.
వారు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా, మెట్టుగూడ రైల్వే క్వార్టర్స్‌లో నివాసముండే బి.సూర్యనారాయణరెడ్డిగా గుర్తించారు. అతను స్థానిక రైల్వే కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారని చెప్పారు. అయితే పట్టాలు దాటుతుండగా లేదా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతని వద్ద ఎలాంటి సుసైడ్ నోట్ దొరకలేదన్నారు.