Cm relief fund | సీఎం సహాయ నిధి పేదల పెన్నిది : విప్ గాంధీ

మియాపూర్ : సీఎం సహాయ నిధి ఆపదకాలంలో పేదల పాలిట పెన్నిదిలా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న పేదలకు ఈ పథకం కొండండ అండగా నిలుస్తున్నదన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎన్టీఆర్ నగర్కు చెందిన రాజు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. 80 వేల నిధుల పత్రాలను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి విప్ గాంధీ బుధవారం తన నివాసంలో అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతతో తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ప్రజలను అన్ని సందర్భాలలో అదుకునేందుకు పథకాలను అందిస్తున్నదన్నారు. ఈ పథకం తన నిరంతర సేవల ద్వారా పేద ప్రజలకు ఆరోగ్య భరోసాను ఇస్తున్నదని విప్ గాంధీ తెలిపారు.
బాధిత ప్రజలకు వీలైనంత త్వరగా ఆర్థిక సాయం అందేలా తాను ఎప్పటికపుడు సంబంధిత విభాగం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు శ్రీనివాస్ యాదవ్, నాయినేని చంద్రకాంత్రావు, సాంబశివరావు, బ్రిక్ శ్రీను, రఘునాథ్, అబ్దుల్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

