సికింద్రాబాద్ : కంటోన్మెంట్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని, ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో నడిపించేందుకు వికాస్ మంచ్ సంస్థ కృషి చేస్తోందని సంస్థ అధ్యక్షుడు ఎబెల్, ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ అన్నారు. జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో బాగంగా కంటోన్మెంట్ పరిధిలోని ప్రజలను చైతన్యం చేసేందుకు కంటోన్మెంట్ వికాస్ మంచ్ సంస్థ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
ఇందులో భాగంగా మంగళవారం బోయిన్పల్లిలోని కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్లో సభ్యత్వ నమోదును ప్రారంభించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వికాస్ మంచ్ సభ్యులు మాట్లాడుతూ కంటోన్మెంట్ పరిధిలో సుమారు 4లక్షల జనాబా ఉన్నారని, జీహెచ్ఎంసీలో ఈ ప్రాంతాన్ని విలీనం చేయడం వల్ల కలిగే లాభాలు తెలియజేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని చెప్పారు.
ఒకటో వార్డులో ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం బోర్డు పరిధిలోని అన్ని వార్డులు, కాలనీలు, బస్తీల్లో విస్తృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ముప్పిడి మధుకర్, జ్ఞాన ప్రకాశ్, ఆమీర్, శ్రీరాములుయాదవ్, శశిగౌడ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.