Samata Sainik Dal | మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసిన సమతా సైనిక్దళ్ రాష్ట్ర నేతలు

ఎర్రగడ్డ : ఆలిండియా సమతా సైనిక్దళ్ రాష్ట్ర ముఖ్య నేతలు మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసి పెండింగ్లో ఉన్న ప్రధాన అంశాల గురించి ప్రస్తావించి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు.
డాక్టర్ అంబేద్కర్ చేసిన రచనలు, ప్రసంగాలు, పరిశోధనలు, ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, సాహిత్యాన్ని ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నదని మంత్రి తమతో పేర్కొనట్లు సమతా సైనిక్దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి లక్ష్మయ్య తెలిపారు.
సమతాదళ్ తెలంగాణ రాష్ట్ర శాఖా కార్యాలయం ఏర్పాటు గురించి అడగ్గా సానుకూలంగా స్పందించారన్నారు. చాలా గ్రామాల్లో ఎస్సీ కమ్యూనిటీ భవనాలు అసంపూర్తిగా మిగిలిన విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తెచ్చామని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రం లో అంబేద్కర్ రచనలలో కొన్నింటిని ముద్రించినా నాటి పాలకులు పట్టించుకోలేదని లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సమతా సైనిక్దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు వైద్యనాథ్లు మంత్రిని కలిసిన వాళ్లలో ఉన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

