మహేశ్వరం : అభివృద్ది పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల అభివృద్ది పనులపై మంత్రి చాంబర్లో సమీక్షాసమావేశము నిర్వహించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..మండల కేంద్రంలో నాలుగులైన్ల రోడ్ల పనులను త్వరగా చేపట్టాలని అన్నారు.
రోడ్డు మధ్యలో డివైడర్లను ఏర్పాటుచేసి పుట్‌పాత్‌లు ఉండే విదంగా రోడ్లను నిర్మించాలని ఆమె అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రక్కనే ఉన్న చిరువ్యాపారస్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూడాలని ఆమె అన్నారు. పురాతన భవనంలో ఉన్న పశువైద్యశాలను కూల్చాలని అధికారులను ఆదేశించారు.
మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పబ్లిక్ టాయిలెట్లను వాడుకలోకి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగ పడేవిదంగా చూడాలని ఆమె నాయకులకు సూచించారు. పెండింగ్ పనులను చేపట్టి త్వరగా పూర్తయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.
ఈకార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, ఎంపీడీవో నర్సింలు, నాయకులు కూనయాదయ్య, చంద్రయ్యముదిరాజ్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ఆధిల్అలీ, నవీన్, కాకికుమార్, మాజీ సర్పంచ్ ఆనందం, మాజీ ఉపసర్పంచ్ దోమశ్రీనివాస్, ఎంఏ సమీర్ డైరెక్టర్లు కడమోని ప్రభాకర్,పొల్కంబాలయ్య,క్రిష్ణ,మల్లేష్, మైసయ్య పాల్గొన్నారు.