Revenue department | అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు

మలక్‌పేట : మూసారాంబాగ్ శాలివాహననగర్ రోడ్ నంబర్-14 మూసీ పరీవాహక ప్రాంతంలోని అంబేద్కర్‌నగర్ కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న మూడు గుడిసెలను గురువారం సైదాబాద్ మండల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.
మూసీబెడ్లోని హైటెన్షన్ వైర్ల పక్కన సుమారు 280 గజాల స్థలాన్ని బకరం యాదగిరి, లక్ష్మీ, కె.రూపేందర్, అనిల్ కుమార్, మైలపాక రాంచందర్ అనే ఐదుగురు వ్యక్తులు కబ్జాచేసి ముగ్గురికి 35 గజాల చొప్పున రూ. 4,50,000 అమ్మగా, కొనుగోలు చేసిన వ్యక్తులు నిర్మాణాలు చేపట్టారని శాలివాహననగర్‌కు చెందిన బాషపాక విష్ణు సైదాబాద్ మండల తహసిల్దార్‌కు ఫిర్యాదు చేశారు.
దాంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి తొలగించాలని తాసిల్దార్ ప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించటంతో గురువారం అంబేద్కర్‌నగర్‌కు వచ్చిన వీఆర్వోలు శ్రీనివాసరెడ్డి అర్చన, అమల, గిర్దవరి శివకుమార్‌లు అక్రమ నిర్మాణాలను సిబ్బందితో కూల్చివేయించి తొలగించివేశారు.
ఈ సందర్భంగా వీఆర్వో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల అక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూసీ బెడ్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు చేపడితే కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఈ కూల్చివేతలలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

