మియాపూర్ : ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఇందుకోసం వారి కష్టసుఖాలలో తోడుగా నిలుస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నదన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆయా డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద దవాఖానా ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 97 వేల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలసి విప్ గాంధీ తన నివాసంలో బాధిత కుటుంబాలకు అంందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తంలా అండగా నిలుస్తున్నదన్నారు. సీఎం సహాయ నిధి క్షణం ఆగకుండా తన నిరంతర సేవలను కొససాగిస్తున్నదని, దీనివల్ల పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా లభించినట్టయిందన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కృష్ణగౌడ్,మోహన్ ముదిరాజ్, చంద్రారెడ్డి, శ్రీను, కాశీనాథ్‌యాదవ్, రాంచందర్, ఇబ్రహీం, రజనీకాంత్ , చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.