మన్సూరాబాద్ : నిరుపేదలకు సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపు తుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ సరస్వతినగర్ కాలనీకి చెందిన అమరావతి గుండెనొప్పితో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించుకుంది.
చికిత్స ఖర్చును భరించలేని స్థితిలో ఉన్న కుటుంబసభ్యులు విషయాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. వెంటనే ఆయన స్పందించి సీఎం సహాయనిధి ద్వార రూ. 60 వేల చెక్కును మంజూరు చేయించారు. సదరు చెక్కును ఆదివారం బాధితురాలు అమరావతికి ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వేలాధి కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడు తున్న పథకాలను తమ రాష్టాల్లోను ప్రవేశపెట్టాలని అక్కడి ప్రజలు ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారని తెలిపారు.
పేదలకు వరం లాంటి సీఎం సహాయనిధిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జక్కిడి రఘువీర్ రెడ్డి, కమాల్‌రెడ్డి, రమేష్ రెడ్డి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.