మోటకొండూర్, ఏప్రిల్ 21: రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, రైతుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో వంగపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, రాజ్యాంగ చట్టాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు.
ఆహార భద్రత చట్టం ప్రకారం రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ రైతుల పట్ల మొండివైఖరి చూపుతుందన్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలిచి పండించిన ప్రతి గింజనూ తామే కొంటామని ప్రకటించడమే కాకుండా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచారన్నారు. ధాన్యం విక్రయంపై రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, ఏఓ సుబ్బూరి సుజాత, డైరెక్టర్లు అనంతుల జంగారెడ్డి, బీస కృష్ణంరాజు, పన్నాల అనిత, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఐలయ్య, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు బురాన్, సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత, సీఈఓ నల్ల భద్రారెడ్డి, నాయకులు ఎర్ర మల్లేశ్, సుధీర్, భూమండ్ల శ్రీనివాస్, నర్సింహులుయాదవ్, బైరోజు వెంకటాచారి, పన్నాల నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.
మోటకొండూర్ : టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి కార్యకర్తకు బీమా సదుపాయం కల్పించిందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని దిలావర్పూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కావటి కరుణాకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నందున రూ.2 లక్షల బీమా చెక్కును బాధితుడి కుటుంబ సభ్యులకు గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్‌గౌడ్, సర్పంచ్ మాధవి, నార్మాక్స్ డైరెక్టర్ లింగాల శ్రీకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, సెక్రటరీ జనరల్స్ ఎర్ర మల్లేశ్, పన్నాల నవీన్‌రెడ్డి, టీఆర్ఎస్వై అధ్యక్షుడు బీస కృష్ణంరాజు, మాజీ సర్పంచ్ సీస బాలరాజు, నాయకులు పాల్గొన్నారు.
రాజాపేట, ఏప్రిల్ 21 : ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతులు ఔదార్యం చాటుకున్నారు. గీత కార్మికుడి కూతురు వివాహానికి ఆర్థిక సాయం అందజేశారు. మండలంలోని రఘునాథపురానికి చెందిన మిట్ట గోవర్ధన్ గీత కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. నాలుగేండ్ల కిందట గోవర్ధన్ ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుంచి పడి తీవ్ర గాయాలై వృత్తికి దూరమయ్యాడు.
ఈక్రమంలో అతని కూతురు మహంతి(కల్పన) వివాహం ఆలేరులోని దొంతిరి గార్డెన్స్‌లో గురువారం జరిగింది. వివాహానికి హాజరైన గొంగిడి సునీత, మహేందర్‌రెడ్డి దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించి రూ.50 వేల సాయం అందజేశారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్‌గౌడ్, టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు పల్లె సంతోశ్‌గౌడ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొండం రాజు, ఉప సర్పంచ్ పల్లె ప్రవీణ్‌కుమార్‌గౌడ్, మాజీ సర్పంచ్ రామిండ్ల నరేందర్, నాయకులు పాల్గొన్నారు.