అంబర్‌పేట : అంబర్‌పేట నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ అధికారులతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సోమవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఇందులో భాగంగా నల్లకుంట డివిజన్లోని ఇంద్రానగర్‌లో రోడ్డు మరమ్మతులు, పూర్తి చేయాలని, గోల్నాక స్మశాన వాటికలో ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ వసతి కల్పించాలని, వచ్చిన వారు కూర్చునే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని, శానిటైజేషన్ పనులు కూడా చేపట్టాలని చెప్పారు.
నారాయణగూడ వైఎంసీఏ క్రాస్‌రోడ్డు వద్ద పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈలు సంతోష్, సుధాకర్, ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.