బంజారాహిల్స్: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల చికిత్స కోసం సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మంజూరయిన చెక్కులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం బాధితులకు అందజేశారు. రహ్మత్‌నగర్ డివిజన్‌కు చెందిన మిస్రుద్దీన్కు రూ.60వేలు, జీనత్బేగంకు రూ.24వేల చెక్కును ఎమ్మెల్యే మాగంటి అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, సీనియర్ నాయకులు నాగరాజు. షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.