అంబర్‌పేట : రాష్ర్ట యువజన, ఎక్సైజ్ శాఖమంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ను బుధవారం అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్లోని మంత్రి వ్యవసాయ క్షేత్రంలో పరామర్శించారు. శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన మంత్రి ని పరామర్శించి శాంతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.