చిక్కడపల్లి : మద్యం షాపుల్లో గౌడ్స్‌కు 15శాతం రిజర్వేషన్ కలిపిస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ వెల్లడించింది. ఈ విషయమై శుక్రవారం కమిటీ చైర్మన్ బాలగౌని బాల్‌రాజ్ గౌడ్ నేతృత్వంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాల గౌని బాల్‌రాజ్ గౌడ్ మాట్లాడుతూ గౌడ్స్‌కు 15శాతం రిజర్వేషన్ కేటాయించడం సంతోషకరమైన విషయమని అన్నారు.
ఈ నిర్ణయం వల్ల గౌడ్స్లో ఆర్థికంగా ఎదిగే అవకాశం లభించిందన్నారు. ఇలాంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్లకు గౌడ్లు రుణపడి ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్, టీజీఓ రాష్ట్ర నాయకులు రవీంధర్ గౌడ్, కృష్ణమూర్తి గౌడ్, బాలగౌని వెంకటేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.