జూబ్లీహిల్స్ : పేద, సామాన్య ప్రజలు అట్టహాసంగా పెండ్లి వేడుకలు జరపుకునేందుకు ఫంక్షన్ హాల్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చేసిన ప్రతిపాదనలకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆమోదం లభించడంతో పాటు నిధులు మంజూరయ్యాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 9 కమ్యునిటీ హాల్లకు తొలి విడత రూ.7 కోట్ల 53 లక్షలు మంజూరయ్యాయి. ఇంతకాలం ఇండ్లల్లో జరిగే శుభకార్యాలకు, బస్తీలలో జరిగే సామూహిక వేడుకలకు కమ్యునిటీ హాల్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. చాలాకాలం క్రితం ఏర్పాటుచేసిన కమ్యునిటీ హాల్లు చిన్నవిగా ఉండడంతో పేద ప్రజలు ఇక్కడ వేడుకలు జరుపుకోవడం కష్టసాధ్యంగా మారుతుండేది.
ఈ నేపథ్యంలో సామాన్యులకు వివాహాది శుభకార్యాల ఖర్చులు తడిసి మోపడయ్యేవి. దీంతో మారుతున్న కాలానికనుగుణంగా పేద ప్రజలు అట్టహాసంగా తమ పిల్లల వివాహాలు, ఇతర శుభకార్యాలు జరిపించుకునేందుకు నియోజకవర్గంలో మల్టీ పర్పస్ పంక్షన్ హాల్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.