రూ.10 కోట్ల నిధుల కేటాయింపు.. పలు కాలనీల్లో పూర్తి.. మరికొన్ని చోట్ల ముమ్మరంగా..
నేరేడ్మెట్, డిసెంబర్ 27 : వినాయక్‌నగర్ డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు పూర్తి కాగా.. మరికొన్ని ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్నాయి. డివిజన్లో ప్రస్తుత జనాభాకు అనుగుణంగా పాత డ్రైనేజీ పైపులైన్ సామర్థ్యం సరిపోకపోవడంతో తరచూ డ్రైనేజీ పొంగి కాలనీల్లో పారుతున్నది. దీంతో స్థానికులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సహకారంతో రూ.10కోట్ల నిధులను కేటా యిం చారు. ఇప్పటికే వినాయక్‌నగర్ డివిజన్లోని పలు కాలనీల్లో అంతర్గత డ్రైనేజీ పనులు ముమ్మరంగా జరుగుతుండగా.. మరికొన్ని కాలనీల్లో పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు. పనులను జీహెచ్ఎంసీ అధికారులు, కా ర్పొరేటర్ రాజ్యలక్ష్మి నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
త్వరగా పనులు పూర్తి చేస్తాం
పురాతన డ్రైనే జీ పైపులైన్వల్ల తరచూ సమస్య ఉత్పన్నమయ్యేది. ఈ నేపథ్యంలో డివిజన్లో రూ. 10 కోట్లతో డ్రైనేజీ పైపులైన్ పనులు చేపట్టాం. ఇప్పటికే పలు కాల నీల్లో పనులు పూర్తయ్యాయి. ఇంకా మరికొన్నిచోట్ల పనులు తుదిదశకు చేరు కున్నాయి. త్వరగా పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
– స్వరూప, వినాయక్‌నగర్ ఏఈ