కొత్తగూడెం సింగరేణి/ కొత్తగూడెం గణేష్టెంపుల్/ పాల్వంచ, మార్చి 16 : ఇరాన్‌పై అమెరికా యుద్ధం నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలను కేంద్రం తక్షణమే నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కొత్తగూడెం బస్టాండ్ వద్ద సోమవారం మానవహారం చేపట్టి, ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. జిల్లా కార్యదర్శి ఎండీ సాబీర్‌పాషా మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నా కేంద్రం మౌనం వహించడం శోచనీయమన్నారు. పాల్వంచ పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ.. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.