మహేశ్వరం, : కుక్కల దాడిలో 27 గొర్రెలు మృతి చెందిన సంఘటన మహేశ్వరం మండల పరిధిలోని కల్వకోల్లో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొజ్జం మల్లేష్ గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తుంటాడు. గురువారం సాయంత్రం అకస్మత్తుగా కుక్కల గుంపు వచ్చి గొర్రెలు మందపై దాడి చేయడంతో 27 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
ఒకేసారి కుక్కల దాడిలో పెద్ద సంఖ్యలో గొర్రెలు మృతి చెందడంతో బాధితులుకన్నీరు మున్నీరయ్యారు. గొర్రెల వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నానని తనకు తగు న్యాయం చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసారు.