దుగ్గొండి: గ్రామాల్లో వందశాతం మందికి కోవిడ్-19 టీకా వేయాలని డీఎంఅండ్ హెచ్ఓ వెంకటరమణ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం దుగ్గొండి మండలంలోని కేశవాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంఅండ్ హెచ్ఓ వెంకటరమణ, ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కోవిడ్ వాక్సినేషన్ ప్రత్యేక కార్య్రక్రమాన్నిపరిశీలించిన ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలోని భంధంపల్లి, లక్ష్మిపురం గ్రామంలో పీహెచ్సీలోని రికార్డులను తనిఖీ చేశారు. కోవిడ మొదటి, రెండో టీకా కోసం గ్రామాలకు వెళ్లి ప్రజలకు ఇబ్బందులు లేకుండా టీకా వేయాలన్నారు.
గ్రామాల్లో కుటుంబసభ్యులందరూ వాక్సిన్ వేసుకున్న ఇంటికి స్టిక్కరింగ్ చేసి గుర్తులను ఏర్పాటు చేయాలన్నారు. రెండో డోసు వేసుకునే వారందరి వివరాలు తెలియజేసి టీకా వేసుకోని వారి ఇళ్లకు వెళ్లి టీకా వేయాలని ఆయన సూచించారు. ఈ కార్య్రక్రమంలో ప్రాథమిక వైద్యాధికారిణి స్వప్న, వైద్యసిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.