బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో యువతి అదృశ్యమయిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఉదయ్ తెలిపిన వివరాల ప్రకారం.,. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీనగర్లో నివాసం ఉంటున్న మహేశ్వరి(20) అనే యువతి రెండునెలలుగా రత్నదీప్ సూపర్మార్కెట్లో పనిచేస్తోంది.
గత నెల 26న ఉదయం డ్యూటీకి వెళ్లిన మహేశ్వరి రాత్రి ఇంటికి తిరిగిరాలేదు. అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో తల్లి లక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.