అమీర్‌పేట్:30 ఏండ్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం తనకుందని, కేసీఆర్‌లా దళితుల అభ్యున్నతి గురించి ఆలోచించిన సీఎం తనకు కనబడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు పేర్కొన్నారు. దళితబంధు పథకంపై విపక్షాల కుట్రలకు నిరసనగా హైదరాబాలోని తన నివాసవలో ఒక్క రోజు దీక్ష చేట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితుల ఆత్మబంధువని అన్నారు. దళితబంధు లాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని చెబుతూ ఈ పథకాన్ని విజయవంతం చేయడంలో ప్రతిఒకరు తమవంతు తోడ్పాటునందించాలన్నారు.
దళితుల ఉజ్వల భవిష్యత్తుకోసంఆలోచిస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనన్నారు. ఎవరు మంచి పని చేసిన ఆహ్వానించాల్సిందేనని, ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎందుకు విమర్శలకు దిగుతున్నారని ప్రశ్నించారు. అంబేడ్కర్ఆశయసాధనకై సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని, దళితులంతా సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ఉండాలన్నారు. దళితుల అభివృద్ధి కోసం రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేస్తానని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, ఆయన మాటలపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.
గతంలో సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున తనను క్షమించాల్సిందిగా కోరుతున్నానని చెప్పారు. దళితబంధును అడ్డుకుంటే విపక్షాలకు మనుగడ ఉండదన్నారు. మోత్కుపల్లి ఒక్కరోజు దీక్షకు సంఘీభావం తెలుపుతూ పలు విద్యార్ధి, యువజన, దళిత సంఘాలు పెద్దయెత్తున ఆయన నివాసానికి ర్యాలీగా తరలివచ్చాయి. దీక్షలో పిడమర్తి రవి, సాగరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.