శామీర్‌పేట : వెదజల్లె పద్దతి వరిసాగుతో ఎన్నో లాభాలు ఉన్నాయని ఏడీఏ వెంకట్రాంరెడ్డి అన్నారు. శామీర్‌పేట మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం పర్యటించి వెదజల్లె పద్దతిలో వరిసాగు చేస్తున్న పంటలను క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ ప్రస్తుతం 20-25 రోజులు పంట కాబట్టి కలుపు నివారణకు కౌన్సిల్ మాక్టివ్ 90 గ్రాములు ఎకరాకు లేదా నిమునిగోల్డ్ 100 ఎంఎల్ ఎకరాకు పిచికారి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబందు అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, వ్యవసాయ అధికారి రమేశ్, ఏఈవో రవి, రైతులు సీతారాంరెడ్డి, సురేందర్‌రెడ్డి, పాల్గొన్నారు.