సికింద్రాబాద్ : నిర్మాణ దశలో ఉన్న కమ్యూనిటీ హాల్ పనులు త్వరిగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసు కొచ్చే విధంగా కృషి చేస్తున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సూచించారు. ఈ మేరకు గురువారం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న కట్టమైసమ్మ కృష్ణానగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సీడీపీ నుంచి సుమారు రూ.40లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తు న్నట్లు తెలిపారు. పనుల్లో వేగం పెంచాలని, బస్తీవాసులకు ఉపయోగపడే విధంగా నిర్మాణ పనులు జరిగే విధంగా చర్య లు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఏ శుభకార్యమైనా కమ్యూనిటీ హాల్ నిర్వహించుకునే విధంగా దీనిని తీర్చిదిద్ద నున్నట్లు చెప్పారు.
ఇప్పటికే నియోజకవర్గం పరిధిలో పదుల సంఖ్యలో నూతన కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని, పేదలకు ఎంతో ఉప యోగకరంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లాస్యనందితా, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, నేతలు టీఎన్ శ్రీనివాస్, సదానంద్‌గౌడ్, కుమార్ ముదిరాజ్తో పాటు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.