Cm relief fund | పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ : డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి

ఉస్మానియా యూనివర్సిటీ : అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తోందని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు నేనున్నా ననే భరోసా కల్పిస్తూ, వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఎంఆర్ఎఫ్ మంజూరు చేస్తున్నారని చెప్పారు.
మూసారాంబాగ్ వాస్తవ్యులు చంద్రశేఖర్‌రావుకు ఇటీవల విపరీతమైన ఛాతినొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించగా గుండెకు స్టంట్ వేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులు డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయానికి వచ్చి తమ పరిస్థితిని వివరించారు.
ఆమె వెంటనే స్పందించి, సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేయించింది. మంజూరైన రూ.60 వేల చెక్కును డిప్యూటీ మేయర్ చేతుల మీదుగా లబ్ధిదారునికి మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

