కొండాపూర్ : ఎస్టీపీల ఏర్పాటుతో చెరువుల్లోకి చేరుతున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేకూరుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జలమండలి ఎస్టీపీ నిర్మాణ విభాగం అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం పెద్ద చెరువులో రూ. 64.14 కోట్ల వ్యయంతో 20.0 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీ నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురుగునీరు చెరువుల్లోకి చేరకముందే శుద్ధి చేయడం ద్వారా చెరువుల్లోని నీరు కలుషితమవకుండా ఉంటుందన్నారు. చెరువుల్లో పరిశుభ్రమైన నీరు ఉండడంతో పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశా లుంటాయన్నారు. ఎస్టీపీల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, అతి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, జలమండలి ఎస్టీపీ విభాగం జనరల్ మేనేజర్ తిప్పన్న, డీజీఎం మురళి, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గానికి మంజూరైన ఎస్టీపీ ప్లాంట్ల వివరాలు
• మియాపూర్ పటేల్ చెరువు 7.0 ఎంఎల్డీ సామర్థం, నిర్మాణ వ్యయం రూ. 26.27 కోట్లు
• గంగారం పెద్ద చెరువు 20.0 ఎంఎల్డీ సామర్థ్యం, నిర్మాణ వ్యయం రూ. 64..14 కోట్లు
• దుర్గం చెరువు 7.0 ఎంఎల్డీ సామర్థ్యం, నిర్మాణ వ్యయం రూ. 25.67 కోట్లు
• ఖాజాగూడ చెరువు 21.0 ఎంఎల్డీ సామర్థ్యం, నిర్మాణ వ్యయం రూ. 61.25 కోట్లు
• అంబిర్ చెరువు 37.0 ఎంఎల్డీ సామర్థ్యం, నిర్మాణ వ్యయం రూ.100.87 కోట్లు
• ఎల్లమ్మ కుంట చెరువు 13.50 ఎంఎల్డీ సామర్థ్యం, నిర్మాణ వ్యయం రూ. 43.46 కోట్లు
• పరికి చెరువు 28.0 ఎంఎల్డీ సామర్థ్యం, నిర్మాణ వ్యయం రూ. 83.05 కోట్లు