Ts rtc | ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు

బంజారాహిల్స్ : పీకల దాకా మద్యం సేవించి ఆర్టీసీ బస్సులో ఎక్కి న్యూసెన్స్‌కు పాల్పడడంతో పాటు బస్సు అద్దాలను ధ్వంసం చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శుక్రవారం సాయంత్రం కొండాపూర్ నుంచి బయలుదేరిన బస్సులో మాదాపూర్ స్టాఫ్‌లో మలక్‌పేటలోని చంచల్‌గూడ ప్రాంతానికి చెందిన తిమ్మిడి శ్రవణ్‌కుమార్ (24) అనే వ్యక్తి ఎక్కాడు. అప్పటికే పీకలదాకా మద్యం సేవించిన శ్రవణ్ కుమార్ టికెట్ తీసుకోకపోగా కండెక్టర్‌తో పాటు ప్రయాణీకులతో వాగ్వాదానికి దిగాడు.
దాంతో జూబ్లీహిల్స్‌రోడ్ నెం 36 లోని నీరూస్ వద్దకు రాగానే బస్సును అపేసి కిందకు దింపేశారు. బస్సు బయలుదేరగానే శ్రవణ్‌కుమార్ వెనకనుంచి పెద్ద రాయిని తీసుకుని విసిరివేశాడు. దాంతో బస్సు వెనకవైపున అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు కండక్టర్ ఎంవీ.గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు శ్రవణ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

