ఎల్బీనగర్ : పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేయుత లభిస్తోందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. శనివారం బహుదూర్పురాకు చెందిన మహ్మద్ షహర్యారుద్దీన్కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అధునాతన వైద్యసేవలను పేదలకు అందించేందుకు సీఎంఆర్ఎఫ్ వరం లాంటిదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదలను అన్ని రంగాల్లో ఆదుకుంటున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ది సాధిస్తోందన్నారు.