మైలార్‌దేవ్‌పల్లి : కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఓ ప్యాక్టరీలో 50లక్షల నగదు చోరీ అయిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు , బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్ కు చెందిన సుదర్శన్‌రెడ్డి బుద్వేల్ ఆనంద్‌నగర్‌లో ఎస్బీ బ్యాటరీ పరిశ్రమ నిర్వహిస్తున్నారు.
దీపావళి పండుగకు తన ఇంటికి పెయింటింగ్ వేయిస్తున్న కారణంగా తమ ఇంట్లో ఉన్న ఫ్యాక్టరికీ సంబంధించిన డబ్బులను తమ పరిశ్రమలోని అల్మారాలో దాచిపెట్టాడు. సోమవారం అర్థరాత్రి 3 గంటల ప్రాంతంలో పరిశ్రమలో ఉన్న వాచ్మెన్ యజమాని ఇంటికి ఫోన్ చేసి ఆఫీస్‌రూమ్ తెరిచి ఉందని, దొంగలు పడ్డారని అనుమానం వ్యక్తం చేశాడు.
హుటహుటిన చేరుకున్న సుదర్శన్ రెడ్డి పరిశ్రమలోకి వచ్చి చూడగా అల్మారా తెరిచి ఉండి అందులో తాను దాచుకున్న 50 లక్షల నగదును దండగులు దోచుకెళ్లినట్టు గుర్తించాడు.వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పరిశ్రమకి చేరుకుని ఫ్యాక్టరీలో ఉన్న సీసీ కెమెరాను చూడగా దుండగులు అక్కడ ఉన్న డీవీఆర్‌ను కూడాఎత్తుకెళ్లారు.
ఉదయం పోలీసు బృందాలు రంగంలోకి దిగి జాగిలాలతో గాలిస్తున్న సమయంలో ప్రక్కనే ఉన్న రైలు పట్టలపై దుండ గులు వదిలి వెళ్లిన డీవీఆర్నుగుర్తించారు. డీవీఆర్‌ను తీసుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి సీఐ కె నర్సింహ, కైమ్ ఇన్స్పెక్టర్ రాజేందర్‌గౌడ్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.