వెంగళరావునగర్ : కుటుంబ కలహాల కారణంగా యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ఆంజినేయులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ బాబా సైలానీ నగర్‌కు చెందిన సల్మా బేగంకు ముగ్గురు కూతుళ్లున్నారు. వీరిలో రేష్మా ఖురేషీ (29) ఇటీవల కుటుంబ సభ్యులతో గొడవ పడింది.
వీరికి 30 వరకు మేకలున్నాయి. ప్రతీ రోజు మేకల షెడ్‌ను రేష్మా ఖురేషీనే శుభ్రం చేస్తుండేది. అయితే పనిభారం ఎక్కవయ్యిందని మేకలను అమ్మివేయాలని తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో రేష్మా గొడవ పడింది. బుధవారం అదే మేకల షెడ్లో కొక్కానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఉదయాన్నే సమీపంలో నివసించే వ్యక్తి రేష్మా ఆత్మహత్యకు పాల్పడిన విషయం గుర్తించి వారి కుటంబ సభ్యులకు తెలిపారు. తల్లి సల్మా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేపరు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.