వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన రెండో విడుత ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. సోమవారం మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు నిర్వహించగా.. నేడు(బుధవారం) జాతీయ రహదారులపై రాస్తారోకో చేయనున్నారు. నిర్మల్ జిల్లా సోన్ నుంచి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని డొల్లార వరకు రోడ్డును దిగ్బంధించనున్నారు. నిర్మల్ జిల్లాలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొననున్నారు. గులాబీ దళం, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్, ఏప్రిల్ 5 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిరసనగా టీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. మొదటి విడుత ఉద్యమంలో భాగంగా కేంద్రం వడ్లు కొనుగోలు చే యాలంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యా ప్తంగా పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, పీఏసీఎస్‌లు, మున్సిపాలిటీలు, డీసీఎంఎస్‌లు, డీసీసీబీ పాలకవర్గాలు తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపించాయి. రెం డో విడుత ఆందోళనలో భాగంగా సోమవారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకు లు, కార్యకర్తలు, రైతులు, స్థానికులు భారీ సం ఖ్యలో పాల్గొన్నారు. వడ్ల కొనుగోళ్ల విషయం లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్ష పూరిత ధోరణి అవలంబిస్తున్నదని, పంజాబ్, ఇతర రాష్ర్టాల్లో రెండు పంటలను కొనుగోలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇక్కడ మాత్రం యాసంగిలో సాగు చేసిన వడ్లను ఎం దుకు కొ నుగోలు చేయడం లేదంటూ టీఆర్ఎస్ నాయకులు, రైతులు మండిపడ్డారు. కేంద్ర ప్రభు త్వం వడ్ల కొనుగోలు చేసే దాకా వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
వడ్ల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రానికి సెగ తగిలేలా టీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగం గా బుధవారం జాతీయ రహదారులను దిగ్బంధం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ 44 జాతీయ రహదారి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో 120 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిర్మల్ జిల్లా సోన్ నుంచి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం డొ ల్లార వరకు ఉన్న ఈ రోడ్డును దిగ్భందం చేయనున్నారు. రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సోన్ మండ లం కడ్తాల్ వద్ద, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ ఎక్స్‌రోడ్ వద్ద జరిగే రాస్తారోకోలో పాల్గొంటారు. ఉదయం 9.30 గంటలకు రా స్తారోకో ప్రారంభం కానుంది.
తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పా ల్పడుతున్నది. పంజాబ్, గుజరాత్ రాష్ర్టాల్లో రెండు పంటలు కొంటున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో మాత్రం వడ్లను కొనుగోలు చేయడం లేదు. నిబంధనల ప్రకారం ధాన్యం సేకరించాలని ఢిల్లీ వెళ్లిన మంత్రులను కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయమని, మీ సమస్య పరిష్కారమవుతందని అవమానించారు. మంత్రు ల పట్ల అవహేళనగా మాట్లాడారు. రాష్ట్రంలోని తెలివిలేని బీజేపీ నాయకులు వరి సాగుచేస్తే కేం ద్రంతో మాట్లాడి కొనుగోలు చేస్తామని రైతులను మోసం చేస్తున్నారు. వ్యవసాయం, రై తుల సమస్యలపై కనీస అవగాహన లేని పీ యూష్ గోయల్‌కు కేంద్ర మంత్రిగా కొనసాగే అర్హత లేదు. కేంద్రం దిగివచ్చి వడ్ల కొనుగోలు చేసే దాకా ఆందోళనలు చేస్తాం.
-మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి