బేగంపేట్ : ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ నగర అదనపు కమిషనర్ బాధవత్ సంతోష్ అన్నారు. ప్రపంచ దోమల దినోత్సవం సంధర్భంగా శుక్రవారం బేగంపేట్ సర్కిల్ అధికారుల ఆధ్వర్యంలో బేగంపేట్ వెంగళ్రావు నగర్లో ఎంటమాలజీ సిబ్బందితో కలిసి స్థానికులకు దోమలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా బాధవత్ సంతోష్ మాట్లాడుతూ… ప్రతి కాలనీ, బస్తీలలో స్థానికులు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
నీరు నిలువ ఉండే పాత్రలపై మూతలు పెట్టి ఉంచాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని సూచించారు. ఇంటి పరిసరాలలోని పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్ సామాగ్రి, పగిలిన కుండలు, వాడిన టైర్లు,డిస్పోజల్స్ లాంటి వాటిని ఎప్పటికప్పుడు తీసివేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, ఏఈలు, ఈ ఎఫ్ ఏలు పాల్గొన్నారు.