Women empowerment | సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

ఆర్కేపురం : సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం వాసవి కాలనీ మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన మార్గదర్శి కాలనీ మహిళా మండలి నూతన కార్యవర్గాన్ని మంత్రి సమక్షంలో ప్రకటించారు.
అదే విధంగా తెలంగాణ బ్రాహ్మణ స్త్రీ శక్తి ఫౌండర్ అధ్యక్షురాలు తాడికొండ అనురాధ ఆధ్వర్యంలో జరిగిన జ్యూట్ బ్యాగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తూ తమ ప్రత్యేకతను చాటుకోవాలని పేర్కొన్నారు.
మహిళలు సమైక్యంగా ఉంటే ఏదైనా సాధించగలరని తెలిపారు. శిక్షణ పోందిన మహిళలకు అసరమైన రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. అదే విధంగా మహిళల కోసం మహిళా మండలి భవనాన్ని ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తా మని తెలిపారు. అంగవైకల్యంతో బాధపడుతున్న శిల్ప అనే మహిళకు ఎలక్టికల్ త్రీ వీలర్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్, సాజీద్, గొడుగు శ్రీనివాస్, మారోజు రామాచారి, కొండ్ర శ్రీనివాస్, యాదవరెడ్డి , పటేల్ సునితా రెడ్డి, లిక్కి ఊర్మిలారెడ్డి, శైలజారెడ్డి, వెంకటేష్‌గౌడ్, పబ్బు శ్రీనివాస్, మహిళా మండలి అధ్యక్షురాలు అధ్యక్షురాలు తాడికొండ అనురాధ, ఉపాధ్యక్షురాలు జోత్స్యలత, లలిత, అనిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

