సికింద్రాబాద్ : నియోజకవర్గంలోని ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలతో పనులు పరుగులు పెడుతున్నాయని వాఖ్యానించారు.
సోమవారం రిసాలబజార్‌లో ఒక కోటి ముఫ్పై లక్షల రూపాయాలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను బోర్డు బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర, సీఈఓ అజిత్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్ం తో కలిసి ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. కంటోన్మెట్ చరిత్రలోనే ఇంత పెద్ద కమ్యూనిటీ హాల్‌ను ఎక్కడ నిర్మించ లేదని, బొల్లారం పరిధిలోని ప్రజలు, శుభకార్యాలకు, విందులకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అందరి ఆమోదంతో, కమ్యూనిటీ హాల్ కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ గా నామకరణం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కంటోన్మెంట్ లోని పలు వార్డులలో 15 పైగా కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు జరుగు తున్నాయని త్వరలోనే సీడీపీ నిధులతో మరిన్ని సామాజిక భవనాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.
కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి రావడంతో ఇక్కడి ప్రజలు ఖర్చులను తగ్గించుకునే విధంగా శుభాకార్యాలకు హాలు ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథం కమ్యూనిటీ హాల్ ల నిర్మాణం కోసం శతవిధాల కృషి చేశారని ఆయన అభీష్టం నేటికి నెరవేరిందని అభినందించారు.
అనంతరం బొల్లారంలోని సర్థార్ వల్లాభాయ్ పటేల్ (కంటోన్మెంట్) జనరల్ దవాఖానాలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్ రెడ్డితో కలిసి ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించారు. బీహెచ్ఈఎల్ ఇంజనీర్ల సారథ్యంలో ఈ ఆక్సిజన్ ప్లాంట్‌ను రూపొందిచారు.
ఈ కార్యక్రమంలో బోర్డు ఇంజనీరింగ్ అధికారులు రాములు,గోపాల క్రిష్ణ దాస్,నామినేటెడ్ మెంబర్ రామక్రిష్ణ,బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్,పాండు యాదవ్,శ్యామ్ కుమార్,సదా కేశవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.