Veeranna Gutta | వీరన్నగుట్ట శివాలయం అభివృద్ధికి రూ.10 కోట్లు : దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

మన్సూరాబాద్ : వీరన్నగుట్ట శివాలయం అభివృద్ధికోసం రూ. 10 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్‌నగర్ పరిధి వీరన్నగుట్టలోని పురాతన స్వయం భూ శివాలయాన్ని ఆదివారం మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయం చుట్టూరా ఉన్న ఆరు ఎకరాల స్థలంలో ఆద్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా నిర్మాణాలు చేస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో అతి పెద్ద దివ్యక్షేత్రంగా వీరన్నగుట్ట శివాలయం అభివృద్ధి చెందనుందని ఆయన పేర్కొన్నారు.

మహా శివరాత్రికి లక్షలాది మంది వచ్చి మహాశివుడిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆలయ పరిసరాలలో రాక్‌గార్డెన్ నిర్మిస్తామని, అదేవిధంగా స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం విశాలమైన పార్కింగ్ సదుపాయం కల్పిస్తామని ఆయన తెలిపారు. గుట్టపైకి కాలి నడకన చేరుకునేందుకు అధునాతమైన రోడ్లను వేస్తామని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓతో మాట్లాడి త్వరలో గుడి చుట్టూ సరిహద్దులను ఏర్పాటు చేసి ప్రహారీగోడలను నిర్మించి ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. భక్తుల స్నానాల కోసం గుట్టపైన కోనేరు నిర్మాణం చేపడుతామని తెలిపారు. వీరన్నగుట్ట రూపురేఖలను మార్చి అతి పెద్ద పుణ్యక్షేత్రంగా మార్చడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

