దళితుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని, సీఎం కేసీఆర్
దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.
మంగళవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా భువనగిరిలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ
ఆధ్వర్యంలో జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లు, మంజూరు పత్రాలు అందించారు. అంతకుముందు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి వారు
పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొంగిడి సునీత మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్
దేశానికి చేసిన సేవలు మరువలేనివని, మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన
సాగిస్తున్నారని అన్నారు. దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నదని,
దళితులు ఆర్థికంగా బాగుంటేనే దేశం బాగుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వారి అభ్యున్నతికి
పాటుపడుతున్నారని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నాయకులు,
అభిమానులు నివాళులర్పించారు.
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 5 : దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు విప్లవాత్మక పథకం అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దళితులు తలెత్తుకొని బతుకాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో తొలివిడుతలో భాగంగా ఎంపిక చేసిన 100మంది దళితులకు మంగళవారం ఆయన స్థానిక రవి మహల్లో దళితబంధు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జయంతి రోజున దళితబంధు యూనిట్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఒక పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.10లక్షల నగదు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దళితులు స్వయం సమృద్ధి సాధించాలని, వ్యాపారంలో రాణించి ఆదర్శంగా నిలువాలన్నారు. పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలకు కూడా దళిత బంధు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు, న్యాయం, ధర్మం వైపు నిలబడాలని కోరారు. విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా ప్రభుత్వం ఇచ్చే లైసెన్స్‌లు, కాంట్రాక్టుల్లోనూ దళితులకు రిజర్వేషన్ కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని తెలిపారు. దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో చేపడుతున్న పథకాలు, విధాన నిర్ణయాలు ఇతర రాష్ర్టాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని కొనియాడారు. కొత్త బడ్జెట్ ప్రకారం ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మందికి దళితబంధు పథకాన్ని అందిస్తామని చెప్పారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.18వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా భరించడానికి సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.