e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home జిల్లాలు నార్మాక్స్‌లో టీఆర్‌ఎస్‌ విజయ భేరీ

నార్మాక్స్‌లో టీఆర్‌ఎస్‌ విజయ భేరీ

 • నాలుగు డైరెక్టర్‌ స్థానాలు కైవసం
 • అంతకుముందే రెండు స్థానాలు ఏకగ్రీవం
 • కాంగ్రెస్‌ పార్టీకి తప్పని భంగపాటు
 • బేరసారయత్నాలకు ఓటర్ల గుణపాఠం
 • నేడు ఉదయం 11గంటలకు చైర్మన్‌ ఎన్నిక
 • చైర్మన్‌ అభ్యర్థిపై అధినేత
 • కేసీఆర్‌దే తుది నిర్ణయం
 • మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
 • పాడి రైతులూ కేసీఆర్‌ వెంటేనని స్పష్టీకరణ
 • నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల
 • పరస్పర సహాయ సహకార యూనియన్‌

(నార్మాక్స్‌) ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బేరసార రాజకీయాలకు భంగపాటు తప్పలేదు. ఓటర్లు తగిన గుణపాఠం చెప్పడంతో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు నామమాత్రం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మంగళవారం హయత్‌నగర్‌లో జరిగిన ఎన్నికల్లో నాలుగు డైరెక్టర్‌ స్థానాలకు నాలుగింటినీ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఆ పార్టీ బలపర్చిన అభ్యర్ధులకు ఇతరులెవ్వరూ దరిదాపుల్లోనూ లేకపోవడం గమనార్హం. గూడూరు శ్రీధర్‌రెడ్డి, కోట్ల జితేందర్‌రెడ్డి, చంద సురేందర్‌రెడ్డి, రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి భారీ ఓట్లతో గెలుపొందారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వారిని అభినందించారు. బుధవారం ఉదయం 11గంటలకు హయత్‌నగర్‌లోని మదర్‌ డెయిరీ కార్యాలయంలో చైర్మన్‌ ఎన్నిక జరుగనున్నది. మొత్తం 15 మంది డైరెక్టర్ల నుంచి ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు. కొత్త చైర్మన్‌ ఎవరనే దానిపై టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌దే తుది నిర్ణయమని మంత్రి గుంటకండ్లప్రకటించారు.

నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్‌28(నమస్తే తెలంగాణ) : నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్‌(నార్మాక్స్‌) డైరెక్టర్ల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. మొత్తం ఆరు డైరెక్టర్‌ స్థానాలకు రెండు మహిళా స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వనిపాకల సొసైటీ చైర్మన్‌ కర్నాటి జయశ్రీ, మహబూబ్‌పేట సొసైటీ చైర్మన్‌ కందాల అలివేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన నాలుగు స్థానాలకూ రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవం చేస్తే డెయిరీ అభివృద్ధికి మేలు జరుగుతుందని టీఆర్‌ఎస్‌ పార్టీ భావించినా కాంగ్రెస్‌ పార్టీ ఒప్పుకోలేదు. రాజీ ఫార్ములా పేరుతో ఆ పార్టీ నుంచి ముఖ్య నేతలు బేరసారాలకు దిగగా అందుకు సమ్మతి లభించకపోవడంతో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని తేల్చారు. ఏకగ్రీవం కావాల్సిన ఎన్నిక కాంగ్రెస్‌ నేతల తీరుతో పోలింగ్‌ వరకు దారి తీసినైట్లెంది. మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డెయిరీ అభివృద్ధి పట్ల తపన కలిగిన గూడూరు శ్రీధర్‌రెడ్డి, కోట్ల జితేందర్‌రెడ్డి, చంద సురేందర్‌రెడ్డి, రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డిని గెలిపించాలని, ప్రభుత్వానికి సహకరించిన వారినే డైరెక్టర్లుగా ఎన్నుకుంటే డెయిరీ అభివృద్ధికి ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి జగదీశ్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఏకగ్రీవం కావాల్సిన ఎన్నికను ఓటింగ్‌ వరకు తీసుకువచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి జగదీశ్‌రెడ్డి.. ఎన్నికలను పార్టీ తరఫున సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాకు చెందిన ఎంపీ బడుగుల లింగయ్య, 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, ప్రస్తుత నార్మాక్స్‌ చైర్మన్‌ గుత్తా జితేందర్‌రెడ్డిని సమన్వయం చేసుకుంటూ మంత్రి ఎన్నికలను నడిపించారు. ఈ మేరకు మంగళవారం హయత్‌నగర్‌లోని ఎస్‌వీ కన్వెన్షన్‌ హాల్‌లో ఉదయం 8.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 306 మంది ఓటర్లకు గాను 303 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభించగా టీఆర్‌ఎస్‌ బలపర్చిన నలుగురు అభ్యర్థులు భారీగా ఓట్లను సాధించారు.

- Advertisement -

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఘన విజయం…

టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులకు అంచనాలకు మించి ఓట్లు వచ్చాయి. మొత్తం 306 సొసైటీల చైర్మన్లు ఓటర్లుగా ఉండగా ఓ అంచనా ప్రకారం టీఆర్‌ఎస్‌కు 217, విపక్ష కాంగ్రెస్‌ 61, సీపీఐ 8, సీపీఎం 8, బీజేపీ 4, మరో 4 స్వతంత్రుల చేతుల్లో ఉన్నట్లు సమాచారం. ఓటింగ్‌కు వచ్చే సరికి ఇతర పక్షాల నుంచి కూడా టీఆర్‌ఎస్‌కు ఓట్లు పోలైనట్లు వెల్లడైంది. ఇందులో మొత్తం 303 మంది ఓటు హక్కును వినియోగించుకోగా టీఆర్‌ఎస్‌ బలపర్చిన గూడూరు శ్రీధర్‌రెడ్డికి 255 ఓట్లు, కోట్ల జితేందర్‌రెడ్డికి 243ఓట్లు, చందా సురేందర్‌రెడ్డికి 232ఓట్లు, రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి 219ఓట్లు సాధించారు. అత్యధిక ఓట్లు సాధించిన తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన వీరిని ఎన్నికల అధికారి జీవీ హన్మంతరెడ్డి విజేతలుగా ప్రకటించారు. వీరితో పాటు బరిలో ఉన్న మిగతా వారిలో ఒగ్గు శ్రీశైలం 94ఓట్లు, సీహెచ్‌ అంజిరెడ్డి 5, ధనావత్‌ కృష్ణ 13, నక్క శ్రీశైలం 13, బి.నరేందర్‌రెడ్డి 14, బి.మోహన్‌రెడ్డి 9, ఏ.ఉపేందర్‌రెడ్డి 5, శీలం వెంకట నర్సింహారెడ్డి 60ఓట్లు సాధించారు. దాంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనువిప్పు కలిగించేలా ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారనడంలో సందేహం లేదు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓటర్లు కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేసినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. రెండు మహిళా స్థానా ల ఏకగ్రీవంతో పాటు ప్రస్తుతం నాలుగు స్థానాల్లో ఘనవిజయం ద్వారా నార్మాక్స్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సంపూర్ణ విజయం సాధించినైట్లెంది.

నేడు చైర్మన్‌ ఎన్నిక…

హయత్‌నగర్‌లోని నార్మాక్స్‌ బోర్డు కార్యాలయంలో నూతన చైర్మన్‌ ఎన్నిక బుధవారం జరుగనున్నది. ఉదయం 11గంటలకు ప్రస్తుతం గెలుపొందిన ఆరుగురితో పాటు ఇప్పటికే డైరెక్టర్లుగా కొనసాగుతున్న తొమ్మిది మందితో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే మొత్తం 15 మంది డైరెక్టర్లలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. డైరెక్టర్లం తా టీఆర్‌ఎస్‌కు సంబంధించిన వారే కావడంతో చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది.

పాడి రైతులూ కేసీఆర్‌ వెంటే : మంత్రి జగదీశ్‌రెడ్డి

పాల ఉత్పత్తిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే ఉన్నారని మరోసారి రుజువైందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద విశ్వసనీయత మరింత పెరిగిందనడానికి నార్మాక్స్‌ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపొందిన నలుగురు అభ్యర్థులు మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి జగదీశ్‌రెడ్డిని కృతజ్ఞతా పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి ఘనంగా సన్మానించారు. ఇది సమష్టి విజయమని, ఈ గెలుపులో రాజ్యసభ సభ్యుడు, డీసీసీబీ చైర్మన్‌తోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నార్మాక్స్‌ చైర్మన్‌ గుత్తా జితేందర్‌రెడ్డి కృషి ఉందన్నారు. రైతులతో పాటు పాడి రైతులు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీపై విశ్వాసంతో సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్‌, చిరుమర్తి లింగయ్య, రమావత్‌ రవీంద్రకుమార్‌, శానంపూడి సైదిరెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, నార్మాక్స్‌ ప్రస్తుత చైర్మన్‌ గుత్తా జితేందర్‌రెడ్డితో పాటు నూతన డైరెక్టర్లు కర్నాటి జయశ్రీ, కందాల అలివేలు, చల్లా సురేందర్‌రెడ్డి, కోట్ల జలంధర్‌రెడ్డి, రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, గూడూరు శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement