వనస్థలిపురం : వనస్థలిపురం ఏరియా దవాఖానలో నిర్వహిస్తున్న డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సందర్శించారు. కేంద్రంలో ఉన్న డయాలసిస్ బాధితులతో మాట్లాడారు. సిబ్బంది, కేంద్రం పనితీరును తెలుసుకున్నారు. డయాలసిస్ కేంద్రం విజయవంతంగా పనిచేస్తోందని, సిబ్బంది ఉత్తమమైన సేవలను అందిస్తున్నారని అభినందించారు.
గతంలో ఎంతో ప్రయాసగా ఉన్న డయాలసిస్ ప్రక్రియను సీఎం కేసీఆర్ చొరవతో సులభతరం చేశామన్నారు. ప్రభుత్వ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఉచితంగా సేవలు అందించడం జరుగుతోందని, వేలాది మంది బాధిత కుటుంబాలకు ఉపశమనం లభిస్తోందన్నారు.
వనస్థలిపురంలో 50మందికి నిత్యం సేవలందిస్తున్నారన్నారు. ఆయన వెంట ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రియ, ఆర్ఎంవో రాజ్, డాక్టర్ కృష్ణ, డాక్టర్ శ్రీభూషన్ రాజు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.