తుమ్మిళ్ల ఎత్తిపోతలతో జలసిరులు సంతరించుకున్నాయి. సమైక్యాంధ్ర పాలనలో ఆర్డీఎస్ ఆగమైంది. 87,500 ఎకరాలకు 15.9 టీఎంసీల కేటాయింపులు ఉన్నప్పటికీ ఏనాడూ 3 టీఎంసీలకు మించి సాగునీరు అందిన దాఖలాల్లేవు. కర్ణాటక, ఏపీ రాష్ర్టాలు నీటి వాటాను దిగమింగి ఆర్డీఎస్ ఆయకట్టును బీళ్లుగా మార్చాయి. తెలంగాణ ఏర్పడ్డాక ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
చివరి ఆయకట్టుకూ సాగునీరు అందించాలన్న సంకల్పంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రూ.789 కోట్లతో రెండు దశల్లో చేపట్టాలని నిర్ణయించారు. రూ.389 కోట్లతో మొదటి దశను 8 నెలల్లోనే పూర్తి చేసి ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు నీటిని విడుదల చేశారు. త్వరలోనే రెండో దశ పనులకు కూడా రూపకల్పన చేయ నున్నారు. ఈ పనులు పూర్తయితే చివరి ఆయకట్టుకూ నీళ్లు పుష్కలంగా అందుతాయి. ఇవేమీ తెలియని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతుండడంపై ఈ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఎస్ ఆధునీకరణ కోసం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపాలని బండిని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి) /అయిజ, ఏప్రిల్ 20 : ఆర్డీఎస్ రైతులకు సాగునీరు అందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో ఆర్డీఎస్ ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతుంటే కనీసం మాట మా ట్లాడని బీజేపీ నాయకులు ఇప్పుడు పాదయాత్రలు చేయడం సిగ్గుచేటని అన్నదాతలు పేర్కొంటున్నా రు.
సమైక్య రాష్ట్రంలో సాగునీరు అందక ఆర్డీఎస్ రైతులు ఆగమైతే బీజేపీ నాయకులు ఎక్కడికి పో యారంటూ రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగా ణ ఏర్పడిన తర్వాత ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీ రు అందించేందుకు సీఎం కేసీఆర్ శక్తివంచన లేకుం డా కృషి చేశారు. అందులో భాగంగానే తుమ్మిళ్ల ఎ త్తిపోతల పథకాన్ని కేవలం 8 నెలల్లో పూర్తి చేసి ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించారు. సుంకేసుల రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌ను ఆర్డీఎస్లోకి ఎత్తిపోసి చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. నడిగడ్డ రైతుల కష్టాలను స్వయంగా చూ శారు కాబట్టే సీఎం కేసీఆర్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథ కం చేపట్టారు. దీంతో ఆర్డీఎస్ రైతుల సాగునీటి కష్టాలు తీరాయి.
స్వరాష్ట్రంలో ఆర్డీఎస్, తుమ్మిళ్ల పథకాల ద్వారా ఏటా వానాకాలం, యాసంగిలో 65 వేల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతున్నది. ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా 5 టీఎంసీలు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా 2.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తున్నారు. సమైక్య పాలనలో చెరువులు, కుంటలు, బావులకు ఆర్డీఎస్ నీరు చేరలేదని, ప్రస్తుతం ఏప్రిల్‌లో సైతం చెరువులు, కుంటలు, బావులను నింపి సాగు, తాగునీటి కష్టాలు లేకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నదాతలు చెబుతున్నారు. సమైక్యాంధ్రలో 3 టీఎంసీలకు మించి ఏనాడు నీరు అందించలేదు. సీఎం కేసీఆర్ ఆర్డీఎస్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించడం వల్లే ఇప్పుడు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతోందని రైతులు చెబుతున్నారు. ఆర్డీఎస్ రైతాంగానికి నీటి ఇబ్బందులు లే కుండా చూస్తున్నారంటున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరులో ఒ క్క ప్రాజెక్టు చేపట్టలేదని బండి సంజయ్ తొండిగా వ్యవహరిస్తున్నడని ఆర్డీఎస్, తుమ్మిళ్ల రైతాంగం ఆ రోపిస్తున్నది. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఆర్డీఎస్ను ఆగం చేస్తున్న సమయంలో మాట్లాడని బీజేపీ నాయకులు.. టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి కష్టాలను తొలగించి బంగారు పంటలు పండేలా చేస్తే ఓ ర్వలేక సీఎంపై అవాక్కులు.. చెవాక్కులు పేలుతున్నారని విమర్శిస్తున్నారు. రైతులపై ప్రేమ ఉంటే క ర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఆర్డీఎస్ ఆధునీక రణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
తుమ్మిళ్లను అనతికాలంలోనే చేపట్టి ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్వవైభవం తీసుకొచ్చి సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిచారు. 87,500 ఎకరాలకు 15.9 టీఎంసీల కేటాయింపులు ఉన్నప్పటికీ సమైక్య రాష్ట్రంలో ఏనాడూ ఆ మేరకు నీరందలేదు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకున్న సీఎం కేసీఆర్ ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో 55,600 ఎకరాలకు సాగునీరు అందించేందుకు తుమ్మిళ్ల మొదటి దశను పూర్తి చేశారు.
త్వరలోనే రెండో దశ పనులకు కూడా రూపకల్పన చేశారు. ఈ పనులు పూర్తయితే చివరి ఆయకట్టు వరకు సాగునీళ్లు పుష్కలంగా అందుతాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తున్నది. తుమ్మిళ్లతోనే ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్వవైభవం వస్తుందనే సంకల్పబలంతో కేవలం 8 నెలల వ్యవధిలోనే ప్రాజెక్టును పూర్తి చేశారు. బండి సంజయ్ మాటలు తగ్గించుకొని ఆర్డీఎస్ ఆధునీకరణకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపాలి.
– తనగల సీతారాంరెడ్డి, ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్, తనగల, వడ్లేపల్లి మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా
సమైక్యాంధ్ర పాలనలో ఆగమైన ఆర్డీఎస్ ప్రాజెక్టుకు పూర్వవైభ వం తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నది. 87,500 ఎకరాలకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో ఏనాడూ 3 టీఎంసీలకు మించి సాగునీరందిన దాఖలాలు లేవు. కర్ణాటక, ఏపీ రాష్ర్టాలు ఆర్డీఎస్ నీటి వాటాను దిగమింగి, ఆయకట్టును బీ ళ్లుగా మార్చాయి. ఆర్డీఎస్ ఆనకట్టను ఆధునీకరించాల్సింది పోయి రాయలసీమ నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఉమ్మడి ఏపీ పాలకులు ప్రాజెక్టును ఏ మాత్రం పట్టించుకోలేదు.
సాగునీరు అందకపోవడంతో రైతులు వలస బాటపట్టారు. రైతుల కష్టాలను కళ్లారా చూసి న ఉద్యమ నేత కేసీఆర్ ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకూ సాగు నీ టిని అందించాలని పాదయాత్ర చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ ఆర్డీఎస్ ప్రాజెక్టుకు కేటాయించిన నీ టి వాటాను అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అందుకనుగుణంగానే చివరి ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందించేందుకు 2017లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 55,600 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రూ.789 కోట్ల వ్యయంతో తుమ్మిళ్లను రెండు దశల్లో చేపట్టారు. మొదటి దశలో రూ.389 కోట్లతో 2018, జనవరి 8న అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మంత్రు లు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. 8 నెలల కాలంలోనే తుమ్మిళ్ల పథకం మొదటి దశ పనులు పూర్తి చేసి 2018, నవంబర్ 24న ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు అధికారికంగా నీటిని విడుదల చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఎనిమిదేండ్లలో ఏనాడూ సాగు, తాగునీటికి ఇ బ్బంది కాలేదు. సమైక్య రాష్ట్రంలో ఆర్డీఎస్ కింద సాగైన పంటలకు నీరందక ఎండిపోతుంటే దిక్కుతోచని స్థితిలో ఉండెటోళ్లం. పెట్టుబడులు రాక వలసలు వెళ్లేవాళ్లం. కేసీఆర్ సీఎం అయ్యాక ఆర్డీఎస్ ఆయకట్టు కింద రెండు పంటలకు సాగునీరు అందుతున్నది. చెరువులు, కుంటలు, బావులు నింపుతున్నరు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ తాగునీరు అందించి రైతు పక్షపాతిగా నిలుస్తున్నాడు. బీజేపీ నాయకులు ఆర్డీఎస్ ఆయకట్టు కింద పంటలు చూసి మాట్లాడితే బాగుంటది.
– ఆంజనేయులు రైతు, పులికల్, అయిజ మండలం
ఆర్డీఎస్, తుమ్మిళ్ల పథకాల ద్వారా పంటలకు మస్తుగ నీళ్లిస్తున్నరు. చిన్నప్పటి నుంచి పొలాలను సాగు చేస్తున్న. గత పాలకులు ఆర్డీఎస్ ద్వారా నీరు సరిగ్గ ఇవ్వకుండ్రి. సీ ఎం కేసీఆర్ వచ్చినంక తుమ్మిళ్ల పథకం పూ ర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తున్నరు. ఏ సర్కారూ అందించని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డీఎస్ కింద చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తుండడంతో పంటలు బాగా పండించుకుంటున్నం. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటం. బీజేపీ, కాంగ్రెసోళ్లు ఏనాడూ రైతుల గురించి పట్టించుకోలే.
– వెంకట్రాముడు, రైతు, మానవపాడు