అర్వపల్లి, ఏప్రిల్ 5 : సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్‌రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మంగళవారం అర్వపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దళితబంధు పథకం లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ సందర్భంగా వారు మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్, దళిత జనోద్ధరణకు కృషి చేసిన బాబు జగ్జీవన్‌రామ్ ఆలోచనా విధానాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని కొనియాడారు. దళితబంధు పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికీ 10 లక్షల రూపాయల ఆర్థికం సాయం అందించి స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 18 లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, విడుతల వారీగా అన్ని కుటుంబాలకు దళితబంధు పథకాన్ని అందజేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టిన దళితబంధు పథకం దళితుల కలలను సాకారం చేస్తుందని, ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగంలా సాగుతుందని పేర్కొన్నారు. మండలంలో 19 మంది ఎంపిక కాగా నలుగురికి ట్రాక్టర్లను, 15 మందికి వివిధ యూనిట్ల ప్రొసీడింగ్స్‌ను అందించారు. దళితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోహన్‌రావు, డీఆర్డీఓ పీడీ కిరణ్‌కుమార్, ఎంపీపీ మన్నె రేణుక, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, సహకార సంఘం చైర్మన్ కుంట్ల సురేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మోత్కూరు, ఏప్రిల్ 5 : దళితుల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మోత్కూరు, అడ్డగూడూరు మండల దళిత బంధు లబ్ధిదారులకు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్‌రెడ్డి, అడ్డగూడూరు ఎంపీపీ దర్శనాల అంజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ అధ్యక్షుడు బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేశం, ఎంపీడీఓ చంద్రమౌళి, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ శ్రీకాంత్, నాయకులు మర్ర అనిల్, తిరుమలేశ్, కుమార్ పాల్గొన్నారు.
అడ్డగూడూరు, ఏప్రిల్ 5 : మండల కేంద్రానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ దళితబంధు ప్రొసీడింగ్ కాపీలను అందించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, జిల్లా కోఆప్షన్ సభ్యుడు గుండిగ జోసెఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చిప్పలపల్లి మహేంద్రనాథ్, తీపిరెడ్డి మేఘారెడ్డి, సర్పంచ్ బాలెంల త్రివేణి, నాయకులు పూలపల్లి జనార్దన్‌రెడ్డి, రణధీర్‌రెడ్డి, బాలెంల అరవింద్ పాల్గొన్నారు.