మెహిదీపట్నం : ఏడేండ్ల మైనర్ బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తికి నాంపల్లి ఏఎంఎస్ జె ( అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి) యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 28వేల రూపాయల జరిమానా విధించింది.
లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లాకు చెందిన పాసుల పకీరప్ప(38) అనే వ్యక్తి 2019లో లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఏడేండ్ల బాలిక పై లైంగికదాడికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు.
వాదోపవాదాలు విన్న కోర్టు బలమైన సాక్ష్యాలు ఉండడంతో సోమవారం తన తీర్పును వెలువరిస్తూ నిందితుడికి శిక్ష విధించింది.