శంషాబాద్ రూరల్ : అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన దిశ హత్య, ఎక్‌కౌంటర్‌పై ప్రజాసంఘాలు ఆందోళన తీవ్రతరం చేయడంతో ఎన్‌కౌంటర్‌పై విచారణ చేయడం కోసం సుప్రీంకోర్టు జస్టిస్ సిర్ఫుర్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సదరు కమిషన్ ఆదివారం ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ చేరుకుంది.
ఈ విచారణ కమిషన్ సభ్యులు మొదట దిశను హత్యచేసిన షాద్‌నగర్ వద్ద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా శంషాబాద్‌లోని తొండుపల్లి టోల్గేట్ వద్ద జరిగిన లైంగికదాడి స్థలాన్ని పరిశీలించారు. కాగా కమిషన్ పర్యటించిన ప్రాంతాలకు మీడియాకు అనుమతివ్వలేదు.
కాగా కమిషన్ సేకరించిన పూర్తి వివరాలను కోర్టులో సమర్పించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి సిర్ఫుర్కర్ కమిషన్ వస్తున్న విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి వచ్చారు. కమిషన్ సభ్యులను కలిసి తనకు జరిగిన ఆన్యాయంపై వివరించినట్లు తెలిపారు. కాగా వారు న్యాయం జరుగుతుందని చెప్పారన్నారు .