ఆర్కేపురం : తెలంగాణ దేవాదాయశాఖ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అర్చక, ఉద్యోగుల సర్వసభ్య సమావేశం గురువారం ఆర్కేపురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అర్చక సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా ఎం.సత్యనారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా తులసి వెంకటరమణాచార్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ దేవాదాశాఖ రాష్ట్ర వైస్ చైర్మన్ వి.రామ్మోహన్రావు మాట్లాడుతూ తెలంగాణ మతైక అర్చక, ఉద్యోగుల సంఘంను అన్ని విధాలుగా బలపరుస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అర్చక, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ సంఘం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం వైస్ చైర్మన్ వి.రామ్మోహన్రావు, ప్రధాన కార్యదర్శి డి.కేశవరెడ్డి, రాష్ట్ర నాయకులు ఎ.చంద్రశేఖర్శర్మ, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సీహెచ్.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్, డి.లక్ష్మణాచార్యులు, శివశంకర్శాస్త్రి, చంద్రమోహన్, విష్టశాస్త్రి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.